

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ మార్చి 29జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు.మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో చేరిన నాయకులు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడిన మండల అధ్యక్షుడు నూకల ఐలయ్య, పిఎసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు మాట్లాడుతూ, సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరిపై అసెంబ్లీ వేదికగా అవమానకర వ్యాఖ్యలు చేయడం, అహంకారంతో వ్యవహరించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు పరస్పరం గౌరవం పాటించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.అలాగే, పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని కడియం శ్రీహరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో సర్పంచ్ కుల్లా మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు అన్నెబోయిన బిక్షపతి, కట్టా మనోజ్ రెడ్డి, అన్నెపు అశోక్, మారెపల్లి ప్రభాకర్, తాటికాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై నిరసనకు మద్దతు తెలిపారు.