భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహర్షి గురుకుల విద్యాలయం 2000-2001 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఓగ్లాపూర్లోని జీఎస్ఆర్ రిసార్ట్లో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆత్మీయ వాతావరణంలో సాగింది.దీర్ఘకాలం అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న సహపాఠులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.ఉపాధ్యాయులతో కలిసి గడిపిన విద్యార్థి దశను స్మరించుకుంటూ,గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బైరెడ్డి వెంకటరెడ్డి,రావుల వెంకట్ రెడ్డి, బి. దేవేందర్ రెడ్డి, ఎస్.కె అంజాద్, హరి ప్రసాద్లను సన్మానించి వారి సేవలను కొనియాడారు.కార్యక్రమంలో అజ్మీర దల్ సింగ్, ఏ. రఘుపతి, వెంకటేశ్వర్లు, సతీష్, కుమార్, రాము, వేణు, సాంబయ్య, సంపత్, అజ్మీర బాలు నాయక్, తిరుపతి, కిరణ్, పల్లవి రాజు నాయక్, రజిత, హారిక, మద్ది రజిత, మాధవి, రజిని, అనిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాటాముచ్చట్లతో,ఆటపాటలతో వేడుకను మరింత సందడిగా మార్చారు. చిన్ననాటి స్నేహాలను గుర్తుచేసుకుంటూ ఆనంద క్షణాలను పంచుకున్నారు.ఈ సిల్వర్ జూబ్లీ వేడుక ద్వారా పాత స్నేహ బంధాలు మరింత బలపడినట్లు పాల్గొన్న వారు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పూర్వ విద్యార్థులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్నేహం, స్మృతులు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచింది
2000-2001 ఎస్ఎస్సి బ్యాచ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
25 ఏళ్ల అనంతరం సహపాఠుల ఆత్మీయ కలయిక–ఉపాధ్యాయులకు సన్మానం
ఆటపాటలతో,స్మృతులతో సందడి – స్నేహ బంధాలు మరింత బలపరిచిన వేడుక