ఘనంగా 'హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్' పునఃప్రారంభం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ‘హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్’ గురువారం ఘనంగా పునఃప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ స్ పార్టీ మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు హాజరై, కొబ్బరికాయ కొట్టి రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక ప్రజలకు మరియు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని పునఃప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు.
యాజమాన్యం మాట్లాడుతూ, తమ రెస్టారెంట్లో రుచికరమైన వంటకాలతో పాటు కస్టమర్ల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు రెస్టారెంట్ యాజమాన్యం. అభిమానులు, స్థానికులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో , రామడుగు అచ్యుత్ రావు, ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,గుగులోతు రాంబాబు,మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్,మార్కండేయ రమేష్,మసభత్తిని సతీష్, గోల్కొండ వెంకన్న, పేపర్ శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు