వ్యవసాయ కూలి మృతి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
రేగొండ మండల పరిధిలోని పొనగండ్ల గ్రామ శివారు చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అల్ల సుధాకర్ (40) అనే వ్యవసాయ కూలి మృతి చెందినట్లు రేగొండ సబ్ ఇన్స్పెక్టర్ డి.సుధాకర్ తెలిపారు. పోలీస్ స్టేషన్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పొనగండ్ల గ్రామానికి చెందిన సుధాకర్ జూలై 29 సాయంత్రం చేపలు పట్టేందుకు ఊరి చెరువు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు,బంధువులు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు.జూలై 31 ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్ద మళ్లీ వెతకగా,చేపల వలలో కాలు చిక్కుకుని నీటిలో మునిగి మృతి చెందిన స్థితిలో సుధాకర్ మృతదేహం లభ్యమైంది.మృతుడికి భార్య లావణ్యతో పాటు ఒక పాప,ఒక బాబు ఉన్నారు.మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వెల్లడించారు.