జూన్ 4 వరకు తీవ్ర వడగాల్పులు
- మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దు :కూడ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హెచ్చరిక
• ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం జాగ్రత్తలు తప్పనిసరి భానుడి భగభగలకు తోడు క్యుములస్ మేఘాల ప్రభావంతో రాబోయే రోజుల్లో వాతావరణం మరింత ఉక్కపోతగా మారనుంది. ఈ నెల జూన్ 4వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుండి ఏకంగా 55 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హన్మకొండ డీసీసీ అధ్యక్షులు, కూడ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో కింద తిరగవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల అకస్మాత్తుగా ఊపిరాడకపోవడం లేదా అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. విపరీతమైన వేడి వల్ల సెల్ ఫోన్లు పేలిపోయే ప్రమాదం ఉన్నందున సెల్ ఫోన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని కోరారు.