

ఈ69 న్యూస్ జనగామ, మే 23
జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను సజావుగా నిర్వహించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇప్పటివరకు జిల్లాలో 1,32,459 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, అందులో 1,23,760 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించినట్లు తెలిపారు.13,115 మంది రైతుల ఖాతాల్లో రూ.233 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.అలాగే 17,499 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసి, అందులో 16,323 మెట్రిక్ టన్నులను గోదాంలకు తరలించినట్లు వెల్లడించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఓపీఎంఎస్ నమోదును ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.