నిరంతర శ్రమతో లక్ష్యాలు సాధన సుసాధ్యం చలమాల సాంబయ్య
స్కిల్డ్ లేకుంటే నేటి మార్కెట్ లో ఓటమే” నేటి పోటీ ప్రపంచ మార్కెట్ లో నిరంతర శ్రమతో పని చేస్తే లక్ష్యాలు సాధన సుసాధ్యం అవుతుందని సత్తుపల్లి ఎస్ బి ఐ లైఫ్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ చలమాల సాంబయ్య ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కు అవగాహన కల్పించారు.శనివారం బ్రాంచ్ లోని ట్రైనింగ్ గదిలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న సాంబయ్య మాట్లాడుతూ బిజినెస్ స్కిల్డ్స్ లేకుంటే నేటి మార్కెట్ లో ఓటమి పాలవడం నూటికి నూరుశాతం కాయమని స్పష్టం చేశారు.భీమా అనేది నామిని కు భరోసా అని భీమా చేసుకుంటే ధీమాగా ఉండొచ్చన్నారు.ముగింపులో సాంబయ్య సత్తుపల్లి నుండి భద్రాచలానికి బదిలీ అయిన సందర్భంగా ఆయనకు అడ్వైజర్లు శాలువా కప్పి పూల దండ వేసి ఘనంగా సత్కరించారు.ఎక్కడకు వెళ్ళినా జీవితంలో మంచి టర్న్ ఇచ్చిన సత్తుపల్లి ను మరిచి పోనని ఎప్పుడూ సహకారంగా ఉంటానని చలమాల తెలిపారు.ఈ కార్యక్రమంలో: డెవలప్ మెంట్ అధికారి తుంగల నాగరాజు,అడ్వైజర్స్ మల్లూరు చంద్రశేఖర్, కువ్వారపు ధర్మవతి నాగేశ్వరరావు,మరికంటి నందిని,బెజవాడ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు