
* దోషులైన మహమ్మద్ సైఫ్ అలీని, కేఎంసి ప్రిన్సిపాల్ ,హెచ్వోడి ఎంజీఎం సూపర్డెంట్ తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి కఠినంగా శిక్షించాలని* ధరావత్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని జనగామ జిల్లా కేంద్రంలో గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జనగామ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడారు*సాయంత్రం 5 గంటలకు జనగామ రైల్వే స్టేషన్ నుండి అంబేద్కర్ స్టాచ్ వరకు క్యాండిల్ ర్యాలీ ఉంటుంది కావున కుటుంబాలతో పిల్లలతో ప్రతి ఒక్కరు కదలి రావాలని పేరుపేరునా కోరుచున్నాము*————————*గిరిజన లంబాడీ ముద్దు బిడ్డ మన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా వాస్తవ్యురాలు ధరావత్ ప్రీతి 26 మృతి కి కారకులైన సీనియర్ విద్యార్థి మహమ్మద్ షైఫ్ అలీ వేధింపులకు, KMC కళాశాల ప్రిన్సిపాల్,HOD, MGM సూపరడెంట్ లకు పిర్యాదు చేసిన పట్టించుకోకుండా సీనియర్ విద్యార్థి సైఫ్ కు మద్దతుగా నిలిచిన విషయంలో దిక్కు తోచని పరిస్థుల్లో డాక్టర్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగిన ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగా మనము భావించాలి.దీనికి కారణం KMC యాజమాన్యం, HOD, MGM ప్రిన్సిపాల్, సైఫ్ మహమ్మద్ తెలంగాణ హోమ్ మంత్రి దగ్గరి బంధువు అవ్వడం వాళ్ళ ఈ కేసును సీరియస్ గా తీసుకోవడం లేదు కావున మనము పెద్ద ఎత్తున స్పందించాలి కావున అందరూ స్పందించి కుటుంబాలతో రైల్వే స్టేషన్ వద్ద నుండి ర్యాలీ చౌరస్తావరకు కాండీల్ ర్యాలీఉంటుంది ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుదాం అందరూ తరలి రండి*డిమాండ్*1. ప్రీతి మృతిపై సిట్టింగ్ జర్జితో న్యాయ విచారణ జరిపించి బాధ్యులైన మహమ్మద్ సైఫ్ అలీని కేఎంసి ప్రిన్సిపాల్ హెచ్ ఓడి వీరితోపాటు ఎంజీఎం సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలి**2. ప్రీతి పేరుతో కళాశాలలో అటానమస్ ప్రైవేటు కాలేజీలలో మెడికల్ కాలేజీలలో ర్యాగింగ్ అరికట్టడం కోసం యాంటీ ర్యాగింగ్ చట్టం చేసి కఠినంగా అమలు చేయాలి తద్వారా ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి**3. ప్రీతి కుటుంబానికి గ్రూప్ అను ఉద్యోగంతో పాటు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి హైదరాబాదులో వెయ్యి గజాల ఇంటి స్థలము ఇచ్చి ప్రభుత్వమే నిర్మించాలి**4. విద్యార్థినిల పట్ల బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల కళాశాలలో జరుగుతున్న అవమానాలను దాడులను వేధింపులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించే కఠిన చర్యలు తీసుకొని బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలవాలి**5. పాఠశాలలకు ఇంటర్మీడియట్ కళాశాలలకు డిగ్రీ పీజీ విద్యాలయాలకు ఆపైన వృత్తి విద్య కోర్సులకు వెళ్లి చదువుకుంటే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి*ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ కౌన్సిలర్ వాంకడోత్ వనిత అఖిల భారత బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు భూక్య వాసు నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు అజ్మీర స్వామి నాయక్ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు లాకావత్ నరేష్ నాయక్ లంబాడి ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మూడు లక్ష్మణ్ నాయక్ బాణోత్ రవి నాయక్ మాజీ ఎంపీటీసీ కాలురామ్ నాయక్ వెంకన్న బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరిలాల్ నాయక్ గిరిజనులు ఉద్యోగస్తులు లచ్చయ్య వెంకటేశ్వర్లు హరి సింగ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు