ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరచండి
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని
పెనుబల్లి మండలంలో గల ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు పిల్లల విద్యా బోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఏ మేరకు బోధిస్తున్నారని విషయాలపై విద్యార్థులను తమ పాఠ్యాంశాలలో పదాలను వివరించాలని కోరారు.
విద్యార్థుల నుండి పాఠ్యాంశాలలో పదాలు సక్రమంగా పలకకపోవడంతో సబ్ కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మానవ వనరులకేంద్రంలో ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థినీ విద్యార్థులకు ఉపాధ్యాయుల బోధనలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్రమశిక్షణతో విద్యను అందించాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగ, ఆసక్తిగా చదువు నేర్చుకునేందుకు ఉపాధ్యాయులు తమదైన శైలిలో పాఠ్యాంశాలు బోధించాలని ఆదేశించారు. విద్యార్థినిలు చదువు పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.