బాధితుడి కుటుంబానికి చైర్మన్ పరామర్శ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హౌజ్ బుజుర్గు గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజేందర్ కుటుంబాన్ని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పరామర్శించారు. రాజేందర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.
వారి దీన స్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ‘ఇందిరమ్మ ఇల్లు’ వచ్చేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి తోడుంటుందని భరోసా ఇస్తూ, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సయ్యద్ మౌల, జిల్లా కార్యదర్శి రజినీకార్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ బోడిగే లక్ష్మి రాంబాబు, సీనియర్ నాయకులు హిమాం, హుస్సేన్, ఖాసీం, dr హుస్సేన్, కరీం సైదోలి, కుమార్, మొగిలి, యాకుబ్, అబ్జాల్, బొబ్బిలి,సాలీమ్, వలి, గ్రామ యూత్ అధ్యక్షులు షరీఫ్ కాంగ్రెస్ తదితర నాయకులు పాల్గొన్నారు.