రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హౌజ్ బుజుర్గు గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి రాజేందర్ కుటుంబాన్ని పరకాల మాజీ శాసనసభ్యులు శ్రీ చల్ల ధర్మారెడ్డి గారు పరామర్శించారు.
అనంతరం తీవ్ర శోకసముద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ.. రాజేందర్ అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, వారి కుటుంబానికి తాము ఎల్లవేళలా తోడు ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని సముదాయించారు. బాధిత కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, వారికి తక్షణ సాయంగా నగదు రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట స్థానిక బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.