ఆదివారం ఖమ్మంజిల్లా తల్లాడ మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామం వచ్చిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ను మాజీ జెడ్పీటీసీ తాతా భాస్కరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు మరియు రైతులు కలిశారు.తమ ప్రాంతంలోని రైతాంగ సమస్యలను బి.వి. రాఘవులు దృష్టికి తీసుకెళ్లారు.ఆయన వాటిని ఓపికగా విని సంబంధిత స్థాయిలో గల అధికారులకు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో: రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు,బండి రమేష్ తదితర నేతలు పాల్గొన్నారు.