బీసీ రిజర్వేషన్ తేల్చినాకే ఎన్నికలకు పోవాలి
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో ఆదివారం బీసీ జెఏసి తెలంగాణ కో కన్వీనర్ నూనె హరిబాబు యాదవ్ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 42%
బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే జిహెచ్ఎంసి, ఎంపీటీసీ,జడ్పీటీసీ,మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ జెఏసి తెలంగాణ కో కన్వీనర్ నూనె హరిబాబు యాదవ్ డిమాండ్ చేశారు.బీసీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన రిజర్వేషన్లు,సంక్షేమ పథకాలు అందక పోవడం అన్యాయం అన్నారు.అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యం లేకపోవడం బాధాకరమన్నారు. రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని. కామారెడ్డి డిక్లరేషన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిర్ణయం తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రకటించిన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.