మరిపెడ లో ఘనంగా హోలీ వేడుకలు.
మరిపెడ మండలంలోని పలు తండాలో ప్రజలు కుటుంబ సమేతంగా ఘనంగా హోలీ పండుగను జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ హోలీ పండుగ విశిష్టతను వారు తెలియజేశారు. వందలాదిబంది కుటుంబ సభ్యులు మహిళలతో సహా, చిన్నపిల్లలతో రంగులు వేసుకుంటూ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, తదుపరి ఆనందము ఐక్యతను స్వాగతించడానికి ఈ హోలీ పండుగను జరుపుకుంటారని వారు. ఈ పండుగ ప్రహ్లాదుడు హోలిక కథతో ముడిపడి ఉందని తెలిపారు.చాలా భారతీయ పండుగల మాదిరిగానే హోలీ కి కూడా ప్రకృతిలో లోతైన సంబంధాలు ఉన్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు సర్పంచ్ అయూబ్ పాషా,పదో వార్డ్ కౌన్సిలర్ బేబీ శ్రీ రవి, 11వ వార్డ్ కౌన్సిలర్ సత్యవతి యుగంధర్, 13వ వార్డ్ కౌన్సిలర్ మైపాల్ రెడ్డి,ఐదో వార్డ్ కౌన్సిలర్ బోడ భాస్కర్, మాజీ వార్డ్ కౌన్సిలర్ పరశురాం, పదో వార్డ్ మాజీ కౌన్సిలర్ హథిరాం నాయక్,సైదుల్, కాలనీవాసులు, యువత, మహిళలు ఇంకా తదితరులు పాల్గొన్నారు.