- జనవరి-19 నుండి 22వ తేదీ వరకు క్రీడాకారులకు క్రీడాభిమానులకు పండుగ
 
ఈ69న్యూస్ మరిపెడ:-
వరుసగావిజయవంతంగా 13సార్లు నిర్వాహణ మరింత బారీగా ఇండోర్ స్టేడియంలో 14వ క్రీడాపండుగకు ఏర్పాట్లు. రూ 3.40లక్షల ప్రైజ్ మనీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలకేంద్రంలో ఆధునిక హంగులతో అద్బుతంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంలో జనవరి 19నుండి 22వ తేదీ వరకు జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పండుగ జరగనున్నది.గత 13సంవత్సరాలుగా ఆర్ధిక, నిర్వాహణ బారమంతా తానే భరిస్తూ ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అంతా..తానై అద్బుతంగా క్రీడోత్సవాలను ఏటేటా. మెరుగైన హంగులతో అత్యంత ఆర్బాటంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.మండలపరిషత్ కార్యాలయం ఆవరణలో మట్టికోర్టులో ప్రారంభమైన మరిపెడ షటిల్ టోర్నమెంట్ గుడిపూడి నవీన్ రావు ఆసక్తితో, ఆదరణతో, చేయూతతోనే అంచలంచలుగా ఎదుగుతూ వచ్చింది.పరదాలు కట్టుకొని లైట్ లు పెట్టుకొని ఔట్ డోర్ లో రాత్రంతా ఆడుకునే షటిల్ క్రీడాకారులకు హైదరాబాద్ వంటి మహానగరాల స్థాయిలో ఓ..ఇండోర్ స్టేడియం డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మహబూబాబాద్ యంపి మాలోత్ కవితల సహకారంతో, గుడిపూడి నవీన్ రావు మరిపెడకు కానుకగా అందించారు.ఏ..మంచి ముహూర్తాన మరిపెడ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కు బీజం పడిందో కానీ గుడిపూడి నవీన్ రావు తన స్వంతఖర్చుతో నిర్వహించే ఈ..క్రీడోత్సవం అంచలంచలుగా పెరిగిపోయి.. అంతర్ జిల్లాస్థాయి నుండి అనేక రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనే బారీటోర్నమెంట్ గా మారింది13సార్లు విజయవంతంగా నిర్వహించిన గుడిపూడి నవీన్ రావు, వారి బృదం.. వరసగా 14వసారి అంతకు మించిన స్థాయిలో క్రీడానిర్వాహణకు సిద్ధం అవుతున్నారు ప్రైజ్ మనీ బారీ గానే మరిపెడలో నిర్వహించే షటిల్ బ్యాడ్మింటన్ ఏర్పాట్లే కాదు.. ప్రైజ్ మనీ కూడా బారీగానే ఉండడం మరో..విశేషం.ఏడు విభాగాలలో నిర్వహించే మరిపెడ మెగాటోర్నీలో 21బహుమతులను, 3లక్షల40వేల రూపాయల నగదుబహుమతులను అందజేయనున్నారు.గుడిపూడి నవీన్ రావు లాంటి సమర్ధవంతుడైన నాయకుడు ముందుంటే అన్నీ తానై నడిపిండానికి మనస్పూర్తిగా పూనుకుంటే నిండుమనసుతో ప్రోత్సహించే పెద్దల దీవెనలు వెంట నడిచే.. సన్నిహితులు, స్నేహితుల ఆప్యాయత, అభిమానాలు తోడైతో.తలపెట్టిన ఏ..కార్యక్రమం ఐనా అంతిమపలితం అద్బుతంగానే ఉంటుంది మరిపెడ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీలాగే ఏటేటా మజాను రెట్టింపు చేస్తుంది.
మరిపెడకే కాదు మన మహబూబాబాద్ జిల్లాకే జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తీసుకవచ్చే షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మరింత విజయవంతం కావాలని కోరుకుందాం. ఆడగలిగితే క్రీడాకారులుగా పాల్గొందాం. లేదంటే నాలుగురోజులపాటు హాయిగా చూసి ఆనందిద్దాం అంటున్నారు ప్రేక్షకులు.