మా ఓట్లు కావాలి మాకు రోడ్ వేయారు
ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఈ రోడ్డు కి రండి
గిరిజన ఆశ్రమ పాఠశాలకి, ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ ఈ రోడ్డుపై శ్రద్ధ లేదు మాకు రోడ్డు వేయండి మహా ప్రభు అని సిపిఎం నాయకులు కు విన్నవించుకోన్న ప్రజలు
పినపాక నుండి పాల్వంచకు వెళ్లి రోడ్డు ఉప్పు సాక, జిన్నిగట్ట ఒడ్డుగూడెం గ్రామానికి పోయే రోడ్డు దారుణంగా చాలా ప్రమాదంగా తయారయింది
బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామం నుండి జిన్నిగట్టు రోడ్డు వరకు కొన్ని సంవత్సరాలు బట్టి ఆ రోడ్డు దారుణంగా తయారైంది అని
సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామస్తులతో హా రోడ్ పై రాస్తారోకో చేయటం జరిగింది అని గ్రామ సభల్లో ప్రజలకు రోడ్డు శాంక్షన్ అయింది అని ప్రతిసారి గ్రామ సభలో చెప్తుంటారు. కానీ గ్రామసభ తీర్మానం చేస్తే ఇన్ని సంవత్సరాలు బట్టి రోడ్ వేయకుండా ఎందుకు ఉంటుంది అని అన్నారు. కాలం మారుతుంది కాలంతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు మారుతున్నారు గాని మా రోడ్డు సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.
ఉప్పుసాక గ్రామంలో 300 మంది గిరిజన ఆదివాసి విద్యార్థుల ఆశ్రమ పాఠశాల ఉంది అక్కడ వందలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు. గిరిజన హాస్టల్ అక్కడికి తల్లిదండ్రులతో సహా వస్తుంటారు పోతుంటారు ఆ రోడ్లో ప్రమాదాలు కూడా జరిగాయి రాత్రులు గోతుల్లో పడి కాళ్లు చేతులు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళు రీసెంట్గా రెంటాల శ్రీను ఆ రోడ్లో గోతిలో పడి మోకాళ్లు చేతులు కూడా కొట్టకపోయిన పరిస్థితి ఉంది.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆ రోడ్లు అనేకసార్లు తిరుగుతుంటారు అట్లనే ఐటీడీఏ పీవో ఆశ్రమ పాఠశాల గిరిజన హాస్టల్ కు అనేక సార్లు వస్తుంటారు. అయినా ఆ రోడ్డుని చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా
వదిలేయటం చాలా దారుణమని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.
వెంటనే ఆ రోడ్డుని ఆ గ్రామ ప్రజలకు ఆశ్రమ పాఠశాలకి ఇబ్బంది లేకుండా బిటి రోడ్డు వేపించాలని సుమారుగా ఏడు కిలోమీటర్లు దూరం ఉంటుంది ప్రజలకు ఇబ్బంది ప్రమాదాలు జరగకుండా వెంటనే ఆ రోడ్డుని
ఆ ఎస్టీ గ్రామాలకు రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కురుస తిరపతయ్య, బోల్లి శ్రీను, రవి కుమార్, ఎడమ వెంకటేశ్వర్లు, సోడే లక్ష్మి ,కురస ఎర్రమ్మ, తదితరులు పాల్గొన్నారు