
హనుమకొండ: మార్టిగేజ్ లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి తమ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ఓ కుటుంబం హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టింది. నేను, నా భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధితుడు మందు బాటిల్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
గుండా రఘురాం, ఆయన భార్యతో పాటు వారికి పూర్తిస్థాయిలో అండదండలు అందించిన బ్యాంకు మేనేజర్ మధుల స్వరూప్ మరియు ఓం నమశివాయలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.