
ధర్మసాగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం కూరపాటి ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు Dr. Kadiyam Kavya ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.వైద్యురాలిగా సేవలు అందించిన ఎంపీఈ సందర్భంగా డా. కడియం కావ్య తన వైద్య వృత్తిని స్మరించుకుంటూ శిబిరానికి వచ్చిన ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. స్వయంగా బీపీ చెక్ చేసి, వైద్య రిపోర్టులను పరిశీలించి అవసరమైన మందులను అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఆత్మీయంగా తెలుసుకుంటూ సేవాభావంతో వ్యవహరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.“వైద్యం వ్యాపారం కాదు – మానవ సేవ”మాట్లాడుతూ ఎంపీ డా. కడియం కావ్య వైద్యం అనేది వ్యాపారం కాకుండా మానవతా దృక్పథంతో చూడాల్సిన రంగమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కూరపాటి ఫౌండేషన్ ట్రస్ట్ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు అవసరంస్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాలు అధికంగా ఉన్నందున మండలాల వారీగా తరచూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. 30-40 ఏళ్ల వయసులోనే హార్ట్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి సంవత్సరం వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సరైన ఆహారం మరియు జీవనశైలిని పాటించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్నవారుఈ కార్యక్రమంలో సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఉప సర్పంచ్ కొమురమ్మ, సాయిపేట సర్పంచ్ లక్ష్మి, మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, కూరపాటి ట్రస్ట్ చైర్మన్ కూరపాటి రమేష్, డాక్టర్ సుస్మిత, ఇతర వైద్యులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
