వెల్నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభం
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
రంగారెడ్డి జిల్లా యల్బీనగర్ నందు అత్యాధునిక సదుపాయాలతో వెల్నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్ ను ఈ రోజు ఉదయం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఐటిశాఖామాత్యులు డి.శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ మాజీ ఆరోగ్య శాఖామాత్యులు, ప్రస్తుతo కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పత్తిపాటి స్వాతి తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ పత్తిపాటి స్వాతి మాట్లాడుతూ ఈ సెంటర్లో అధునాతన రోబోటిక్ ఫిజియోథెరఫితో పాటుగా, ఆక్వాతెరఫి,ఐసీయూ యూనిట్,తదితర ముఖ్యమైన విభాగాలున్నట్లుగా ఆమె తెలియజేశారు.