
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
నేటి సద్దుల బతుకమ్మ ఆటలో మహిళాల ఆటపాటలకు కోసం ఉమ్మడి రేగొండ గోరికొత్తపల్లి మండలంలో స్థలాల ముస్తాబుకు పంచాయతీ కార్యదర్శి లు,మాజీ ప్రజా ప్రతినిధులు ఇతరత్రా పార్టీల నాయకులు ముందుకొచ్చి ఆట స్థలాలను ముస్తాబు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల అత్యంత ప్రీతివంతమైన సద్దుల ఆటల కోసం గ్రామాలలో మహిళలు బతుకమ్మ ఆడే స్థలాలను చదును చేస్తూ ముస్తాబు చేస్తున్నారు.నూతన గోరి కొత్తపల్లి మండలంలో ఆదివారం గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యదర్శి బాల వేణి రాంబాబు ట్రాక్టర్లతో స్థలాలను గుర్తించి పిచ్చి మొక్కలను తొలగిస్తూ గుంతలుగా ఉన్న వాటిని ముస్తాబు చేస్తున్నారు.నూతన గోరి కొత్తపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు పక్కన కుంట ఆవరణలో స్థానిక పంచాయతీ కార్యదర్శి బాలవేణి రాంబాబు కారోబార్ కట్ల నాగరాజు గ్రామపంచాయతీ సిబ్బందితో పాటు గోరికొత్తపల్లి మండల నాయకులు మాజీ సర్పంచ్ సూధనబోయిన ఓం ప్రకాష్, దగ్గరుండి స్థలాలను చదును చేస్తున్నారు.అత్యంత ప్రీతివంతమైన బతుకమ్మ ఆటలను ఆడుకుంటున్న మహిళలు ఆదివారం చివరి రోజున సద్దుల బతుకమ్మ పండుగకు ఇతర ప్రాంతాల్లో ఉన్న మహిళలు సైతం అత్తారింటి నుంచి తల్లి ఇంటి వద్దకు పిల్లాపాపలతో తరలివచ్చి సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆయా గ్రామాల కార్యదర్శులు గ్రామపంచాయతీ కారోబార్ కట్ల నాగరాజు కాంగ్రెస్ గోరి కొత్తపల్లి మండల గ్రామ కమిటీ అధ్యక్షుడు పుట్ట రవి యూత్ నాయకుడు జూపాక అశోక్ ఎమ్మార్పీఎస్ నాయకులు పసుల రాకేష్ గ్రామపంచాయతీ సిబ్బంది బొమ్మకంటి దుర్గయ్య దువ్వ అశోక్ దగ్గరుండి ట్రాక్టర్లచే స్థలాలను ముస్తాబు చేస్తున్నారు.స్థలాల ముస్తాబుతోపాటు గ్రామాలలో విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేస్తూ ఆదివారం రోజున బతుకమ్మ ఆడే ప్రాంతాలలో కరెంటు వైర్ ద్వారా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తున్న సంఘటనలు గ్రామాలలో చురుకుగా,రేగొండ మండల కేంద్రంలో కార్యదర్శి సిబ్బందితోపాటు,బతుకమ్మ ఆటల కోసం వచ్చే మహిళల్లో ఉత్తేజాన్ని నింపేందుకు రేగొండ మండల టిఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు కోలపాక బిక్షపతి సద్దుల బతుకమ్మలను ఆడే రేగొండ మండల కేంద్రంతో పాటు,రావులపల్లె గ్రామాలలో స్వచ్ఛందంగా డీజెలు, లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.అలాగే ఉమ్మడి మండలంలో పలు గ్రామాల్లో పార్టీ నాయకులతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు సద్దుల బతుకమ్మ ఆడే స్థలాల వద్ద దగ్గరుండి ముస్తాబు చేస్తున్నారు.