సమంత లో సమ్మె సైరన్
రెండో రోజుకు చేరిన డి.ఎల్.ఆర్.కార్మికుల పోరాటం వేతనం పెంచకుంటే నిరవధిక దీక్ష చేస్తాం:చలమాల విఠల్ రావు(సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు) సత్తుపల్లి శివారులోని జెవిఆర్ సింగరేణి ఓ.సి లో గల సమంత కంపెనీ లో పని చేస్తున్న డి.ఎల్.ఆర్. కార్మికులు శుక్రవారం సమ్మె సైరన్ మోగించారు.
శనివారంతో రెండో రోజుకు చేరింది.శనివారం సందర్శించి మద్దతు తెలిపిన సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ కేవలం 400 రూపాయల వేతనం ఇవ్వడం దుర్మార్గమని కార్పోరేట్ యాజమాన్యాలు కార్మికుల రక్తం తాగుతున్న పాలకులు పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే 850 రూపాయలకు వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.మా భూములు కొనుగోలు చేసి పచ్చని పంట చేలను ధ్వంసం చేసి కోట్లు గడిస్తున్న సింగరేణి భూములు కోల్పోయిన పేదలకు డి ఎల్ ఆర్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చి వేతనం ఇవ్వకుండా ఉంటే సహించమన్నారు.సమంత యాజమాన్యం దిగి రాకుంటే నిరవధిక దీక్ష చేస్తామని హెచ్చరించారు.కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కారు తెచ్చిన లేబర్ కోడ్లు అండ చూసుకొని కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్నారని విఠల్ స్పష్టం చేశారు.ఫిబ్రవరి 12 న జరగనున్న దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో:సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తడికమళ్ళ చిరంజీవి,కార్మికులు దంత సాయికృష్ణ,ప్రసాద్,లక్ష్మణ్,ఆరీఫ్,రవితేజ,సురేష్,టి. నాగేంద్రబాబు,సతీష్ కుమార్,వీరభద్రం,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.