సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన అభినందన సభ
యూరియా బస్తా ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
సబ్బండ వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం
సర్పంచ్ ల అభినందన సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల నూతనంగా గెలిచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్,ఉప సర్పంచ్ల అభినందన సన్మాన సభ పి ఎస్ ఆర్ కన్వెన్షన్ లో జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరుహై మాట్లాడుతూ తెలంగాణలో మార్పు మొదలైంది అన్నారు,కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ అంతటా తిరుగుబాటు ప్రారంభమైంది అని,ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని రెండేళ్లలో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు,గతంలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబంధును రైతుల ఖాతాల్లో వేశాం. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 11 సార్లు రైతుబంధు పథకం కింద రూ. 72 వేల కోట్లు వేశారు అన్నారు,దొంగ మాటలు, అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అన్ని వర్గాలకు అన్ని రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసింది అన్నారు, రైతులకు యూరియా బస్తాలు లేక నానా అవస్థలు పడుతున్నారన్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా యురియా బస్తా కొరకు ఇబ్బంది పడలేదన్నారు,కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల పైన,దేవుళ్ల పైన ఒట్లు పెట్టి మరీ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారు అన్నారు,కేసీఆర్ కాలు బయట పెట్టగానే కొన్ని జంతువులు మొరుగుతున్నాయి. ఒక్క మీడియా సమావేశానికే వణికిపోతున్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని అన్ని భాషల్లో తిట్టగలిగే శక్తి నాకు ఉన్నది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్.. అవసరమైతే గిరిజన భాష నేర్చుకొని మరీ బుద్ధి చెప్పగలిగే శక్తి మాకు ఉన్నది. కానీ ముఖ్యమంత్రి అనే పదవికి గౌరవం ఇచ్చి ఓపిక పడుతున్నాం అన్నారు,నేను గుంటూరులో చదువుకోవడం తప్పు అంటున్నారు, మరి రేవంత్ రెడ్డి భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకుంటే అది ఒప్పెలా అవుతుంది అని దుయ్యబట్టారు,నువ్వు మా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా దూషించినా,సంస్కారంగా ఉంటున్నాం. రేవంత్ రెడ్డికి పని చేతగాక రోజుకో కమిషన్, స్కామ్, కేసు అంటూ టైం పాస్ చేస్తున్నాడు అన్నారు,ఫార్ములా – ఈ, కమిషన్లు, ఫోన్ ట్యాపింగ్ అంటూ పాలనను పక్కన పెట్టాడు. బంగారు పళ్లెంలో రాష్ట్రం అప్పగిస్తే నడపడం చేతకావడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నారు,ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేయడం ఆపి, వెంటనే హామీల అమలు పైన దృష్టి పెట్టాలి అన్నారు,తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. అధికార పార్టీ అరాచకాలను, అక్రమాలను తట్టుకొని మరీ భారీ సంఖ్యలో గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా మన పార్టీ నేతలు గెలిచారు. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి వంటి పెద్ద నాయకులు అధికార పార్టీ ప్రలోభాలకు లోనై పార్టీ వీడి పారిపోతే, గ్రామ గ్రామాన ఉన్న పార్టీ నేతలు నిలబడి కొట్లాడి గెలిచారు అన్నారు,అలాంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ తరఫున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.మన పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల పైన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది. కానీ రాజ్యాంగబద్ధంగా గ్రామ పంచాయతీలకు ఉన్న అధికారాలను తెలుసుకొని, కాంగ్రెస్ ప్రలోభాలకు తలవొగ్గకుండా గ్రామాలకు మంచి చేసే అవకాశం మనకు ఉన్నదన్న విషయాన్ని సర్పంచులు గుర్తించాలి అన్నారు,తండాలను గ్రామ పంచాయతీలు చేసి అభివృద్ధి చేసింది కేసీఆర్. ఒకప్పుడు తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లే పరిస్థితి ఉండేది.. అటువంటి గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాం. దేశంలో 3 శాతం జనాభా లేని తెలంగాణకు 30 శాతం కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి అన్నారు,గెలిచిన సర్పంచులను బెదిరిస్తారు,కానీ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి అబ్బ సొత్తు కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, గ్రామానికి సర్పంచ్ అలాగే. కేంద్రం విడుదల చేసే నిధులలో 75 శాతం గ్రామ పంచాయతీకే నేరుగా వస్తాయి. రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయి అన్నారు,మిగతా గ్రామాల సర్పంచులకు ఆదర్శంగా ఉండేలా బీఆర్ఎస్ సర్పంచుల గ్రామాల్లో అభివృద్ధి చెయ్యాలి అన్నారు,ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలవంతంగా మన పార్టీ సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తే, వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో త్వరలో శిక్షణ కార్యక్రమాలతో పాటు ఒక ‘లీగల్ సెల్’ను కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లీగ్ మ్యాచ్ రూపంలో అద్భుతమైన విజయం సాధించిన మనం, రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ సెమీఫైనల్స్‌లో గెలిచి, భవిష్యత్తులో అసెంబ్లీ, పార్లమెంట్ అనే ఫైనల్ ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకొని కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందాం అన్నారు,లగచర్లలో గిరిజన ఆడబిడ్డల పైన కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకు అండగా మహబూబాబాద్‌లో నిర్వహించిన భారీ సమావేశం తర్వాతనే లగచర్ల భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మహబూబాబాద్ లాంటి మారుమూల జిల్లా కేంద్రంలోనూ మెడికల్ కాలేజీని, జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది అన్నారు,నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం అని, రామచంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది అన్నారు,ఢిల్లీకి డబ్బు సంచులు ఇచ్చే వాళ్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీకి డబ్బు సంచులు ఇచ్చి ఉంటే 1970 దశకంలోనే రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారు అన్నారు, ఢిల్లీ గులాములు రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే ఆయన ఆత్మ క్షోభిస్తుంది అన్నారు,రానున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను అన్నారు,ఈ కార్యక్రమంలోమాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత,మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, హరిప్రియ నాయక్, మాజీ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడి నవీన్ రావు, బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి,యాళ్ల మురళీధర్ రెడ్డి. ఎన్నారై తిరుపతిరెడ్డి,కుడితి మహేందర్ రెడ్డి, క్లాస్ వన్ కాంట్రాక్టర్ అచ్యుతరావు, మాజీ మార్కెట్ చైర్మన్ బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, నీలం దుర్గేష్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.