సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో పైథాన్ వర్క్ షాప్
సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామంలో గల సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న అన్నీ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థినీ,విద్యార్థులకు పైథాన్ పై వర్క్ షాప్ ఈ నెల 05 వ తేదీన ప్రారంభం అయింది.ఈ వర్కుషాప్ కు ట్రైనర్ గా డాక్టర్ షేక్ రసూల్ అసోసియేట్ ప్రొఫెసర్ ఈసిఈ విభాగం సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాల సికింద్రాబాద్,డాక్టర్ కె విజయ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసిఈ విభాగం),డాక్టర్ యస్ రాజ్ కుమార్(అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అమృత విశ్వవిద్యాపీఠం అమరావతి),మిస్టర్ తాటికొండ నాగసాయి (స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అమృత విశ్వ విద్యాపీఠం అమరావతి) వ్యవరిస్తున్నారు.వీరి ద్వారా గత 3రోజుల నుంచి నిర్వహించిన పైథాన్ వర్క్‌షాప్ నేటితో ముగిసింది. ఈ పైథాన్ వర్క్‌షాప్ వల్ల ఇంజనీరింగ్ బ్రాంచీ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అర్హత సాధించటానికి మరియు మంచి నాలెడ్జ్ సంపాదించి ప్రభుత్వ మరియు కార్పొరేట్ సంస్థల్లో కొలువులు సాధించదానికి ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేయడానికి కావలసిన నైపుణ్యం కోసం ఈ పైథాన్ వర్క్‌షాప్ అని ట్రైనర్లు తెలిపారు.కళాశాల సెక్రటరీ&కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నేటి ప్రస్తుత పోటీ ప్రపంచంలో మీ నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది సమయం. పైథాన్ టెక్నాలజీ రోజు రోజుకీ వివిధ రంగాల్లో విస్తరిస్తోంది. విద్యార్థులు మార్కులు సాధించటం ప్రామాణికంతో పాటు తరగతి గదుల్లో కూడా నేర్చుకున్న అంశాలకు క్షేత్రస్థాయిలో చేసే ఉద్యోగం సమర్ధవంతంగా చేయగలగాలి.తాను నేర్చుకున్న పాఠ్యఅంశాలపై పట్టు సాధించి తమ నైపుణ్యాలకు పదును పెట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ విజయం సాధించి తమ ఉద్యోగరంగంలో ముందడుగుతో ముందుకు సాగాలనే లక్ష్యంతో ఇటువంటి పైథాన్ వర్క్ షాప్ కార్యక్రమం ద్వారా ఉద్యోగoపై స్కిల్స్ పెంచుకున్నే అవగాహన పెరుగుతుందన్నారు.మిళితం చేయటం ద్వారా నైపుణ్యం పెంపొందుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ పైథాన్ అనేది ఒక కంప్యూటర్ భాష. ఇది ఒక బహుళ ప్రయోజనకరమైన ఉన్నత స్థాయి (హై లెవెల్ ప్రోగ్రామింగ్)భాష.(పైథాన్ కార్యక్రమ భాష)ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచే విద్యార్థినీ,విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెంపొందుతాయని సాఫ్ట్వేర్ మీద మంచి అవగాహన కలిగి ఉండటంతోపాటు దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలపడం జరుగుతుందన్నారు.ఇప్పటికే ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపుదల చేపట్టడం జరిగిందని విద్యార్థులు ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన నైపుణ్యం ఇటువంటి పైథాన్ వర్క్‌షాప్ లో ప్రత్యేక శిక్షణ కల్పించేందుకు సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వారు ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థినీ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యతో పాటు వైజ్ఞానిక, సృజనాత్మకత ప్రతిభను వెలికి తీస్తుందన్నారు. ఇంజనీరింగ్ విద్య ఉత్తీర్ణత మీ జీవితానికి గొప్ప మలుపు అన్నారు. పైథాన్ వర్కుషాప్ పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోందని చెప్పారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త,విద్యాధికులు హెటేరో గ్రూప్ అఫ్ కంపెనీస్ అధినేత మరియు సాయిస్ఫూర్తి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ చైర్మన్ డాక్టర్ బండి.పార్ధసారథిరెడ్డి వర్చువల్ లో విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో:కళాశాల ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతుల విభాగాధిపతి మరియు సైన్స్ & హ్యుమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ షేక్.మీరాసాహెబ్,కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సి.ఎస్.ఈ) విభాగం ఫ్యాకల్టీ మెంబర్స్, కళాశాల సైన్స్ & హ్యుమానిటీస్ విభాగం ఫ్యాకల్టీ మెంబర్స్ మరియు విద్యార్థినీ, విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.