సాయిస్ఫూర్తి కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన సదస్సు
సత్తుపల్లి మండల పరిధిలోని
బి.గంగారం గ్రామంలో స్వయం ప్రతిపత్తి సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.
ఈ సదస్సులో వైద్య నిపుణులు గుళ్లపూడి రమ్య (స్త్రీరోగ నిపుణి), శ్రీహరి (కిరణ నిర్ధారణ నిపుణుడు) ప్రసంగించారు. రమ్య మాట్లాడుతూ క్యాన్సర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన అవసరమని పేర్కొన్నారు. శ్రీహరి మాట్లాడుతూ బాల్యంలో వచ్చే క్యాన్సర్లు అరుదుగా ఉన్నప్పటికీ తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు.
బాల్యంలో కనిపించే రక్త సంబంధిత, మెదడు-నాడీ వ్యవస్థ, కడుపు, కంటి, ఎముకలు, మృదు కణజాలం, జనన కణజాలాలకు సంబంధించిన క్యాన్సర్లపై వివరించారు. లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే 70 నుండి 90 శాతం వరకు పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు.
ఇక శ్రీధర్ మాట్లాడుతూ పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు, అలసట, తరచూ నొప్పులు, చూపు సమస్యలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. రెండు వారాలకు పైగా సమస్యలు కొనసాగితే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు.కార్యక్రమంలో: ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాధికుడు, హెటిరో ఫార్మాస్యూటికల్ సంస్థ అధినేత, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టు సభ్యురాలు బండి అన్విద వర్చువల్‌గా పాల్గొని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు.
కళాశాల కార్యదర్శి దాసరి ప్రభాకర్ రెడ్డి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రిన్సిపాల్ వూటుకూరి శేషారత్నకుమారి, సైన్స్ మరియు హ్యుమానిటీస్ విభాగాధిపతి షేక్ మీరాసాహెబ్, వివిధ విభాగాలాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.