
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ మే09
స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో కాజీపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొగ్గు గూడ్స్ రైలులో మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఎండ వేడి కారణంగా బొగ్గు బోగీలో మంటలు అంటుకున్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎస్సై పిట్ట రాజేష్ తన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఆయన ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేయగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఎండ తీవ్రత వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఎస్సై పిట్ట రాజేష్ తెలిపారు.పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతోంది.