


ఇన్స్పెక్టర్ మహేందర్ సత్వర స్పందనతో అదుపులోకి మంటలు
ఈ69న్యూస్ హన్మకొండ, మే 24
హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ స్కూల్, విహాన్ స్కూల్ ముందు ఉన్న వ్యవసాయ పొలాల్లో ఆదివారం సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి.వరి కొయ్యలు మంటలకు ఆహుతి కావడంతో అగ్నిజ్వాలలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ ఏ. మహేందర్ పోలీస్ బలగాలు, బ్లూ కోట్స్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.పోలీసుల సత్వర చర్యలతో సమీపంలోని ఇండియన్ స్కూల్, విహాన్ స్కూల్లకు ముప్పు తప్పింది. పెద్ద అగ్నిప్రమాదం సంభవించే అవకాశాన్ని ముందుగానే నివారించగలిగారు.ప్రాథమిక దర్యాప్తులో వ్యవసాయ పొలాల్లో ఉన్న వరి కొయ్యలకు మంటలు అంటుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు ధృవీకరించారు. ఘటనకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోందని, అవసరమైతే సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. పొలాల వద్ద చెత్త, పొడి గడ్డి, ప్లాస్టిక్ వంటి సులభంగా మండే పదార్థాలు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర హెల్ప్‌లైన్ 100, 8712685015 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.