E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 May, 2026E69NEWS

అనంతసాగర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి–నలుగురు అరెస్ట్

ఈ69న్యూస్ హసన్‌పర్తి, మే 2

హన్మకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు శనివారం దాడి నిర్వహించారు. ఎస్సై శ్రీ సుజిత్ ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి చేసిన ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులను గమనించిన వెంటనే అక్కడున్న ఏడుగురిలో ముగ్గురు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్నవారిలో ముత్యాల మహేష్ కుమార్, కిమిడి శ్రీనివాస్, సిద్ధపాటి నాగ శ్రీనివాస్, బుస దేవేందర్ ఉన్నారు. పరారైన వారిలో మహేందర్, సుధాకర్, నిమ్మల రాజు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో రూ. 9,750 నగదు, 104 పేక ముక్కలు, 4 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, పరారైన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *