అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలిఅమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ24 February, 2026E69NEWS

అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి

అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి

ప్రపంచ కార్మికులకు
దిక్సూచి కమ్యూనిస్టు ప్రణాళిక:చలమాల విఠల్ రావు (సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు)

అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని, ప్రపంచ కార్మికులకు దిక్సూచి కమ్యూనిస్టు ప్రణాళికని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు అన్నారు. మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండల కేంద్రoలోని చలమాల సూర్యనారాయణ భవనంలో రేట్ బుక్ డే కార్యక్రమాన్ని మండల కమిటీ సభ్యులు తడికమళ్ళ చిరంజీవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చలమాల విఠల్ రావు మాట్లాడుతూ కారల్ మార్క్,ఫెడరేట్ ఎంగిల్స్,రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడి 1948 ఫిబ్రవరి 21 రోజును రెడ్ బుక్ డే గా గుర్తుంచుకుంటామని స్పష్టం చేశారు.ఈ చిన్న గ్రంధం ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ శ్రామిక వర్గానికి పిలుపునిచ్చి పెట్టుబడిదారీ వర్గాన్ని ఉలిక్కిపాటు గురిచేసిందని, పెట్టుబడిదారీ,దోపిడీ దారుల కబంధహస్తాలలో చిక్కుకున్న, ప్రపంచ శ్రామికులకు కమ్యూనిస్టు ప్రణాళిక ఒక దిశ నిర్దేశించిందన్నారు. అమెరికా పెట్టుబడిదారులకు, ప్రజావ్యతిరేక శక్తులకు, కొమ్ము కాస్తూ ప్రపంచ దేశాల మధ్య యుద్దోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, ఆయన విమర్శించారు. ప్రపంచ దేశాల మీద తన ఆధిపత్యం కోసం సుఖాలను వేధిస్తూ బెదిరింపులకు లొంగుబాటు చేసుకొనటం దాడులు చేస్తుందని స్వదేశాలను బందీలుగా చేయడం కోసం బాగుంటుందని, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను, ఐక్యరాజ్యసమితిని, కూడా లెక్కచేయకుండా తన సామ్రాజ్యవాద వైఖరిని అమెరికా ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. మన దేశం మీద అమెరికా సొంకాలతో దాడి చేస్తున్నప్పటికీ విశ్వ గురువుగా చెప్పుకునే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పకు పోవడం, అమెరికా విధానాలను ప్రోత్సహిస్తుంది. సిగ్గుచేటని, ఆయన విమర్శించారు.ఈ రెడ్ బుక్ డే సమావేశంలో: సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, మండల కమిటీ సభ్యులు నల్లమల్ల అరుణ్ ప్రతాప్, చలమాల నరసింహారావు, కండే సత్యం, రైతు సంఘం మండల అధ్యక్షుడు చిట్టి మొదల కృష్ణ, సిఐటియు మండల నాయకులు తాండ్ర రాజేశ్వరరావు, వి. రవీంద్ర, డి. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొని కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకం పైన చర్చ జరిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *