E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ20 March, 2026E69NEWS

గరిమిళ్లపల్లి పాఠశాలకు ఉపాధ్యాయురాలి ఔదార్యం

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయురాలి సేవ

తెలుగు గళం న్యూస్ ఐనవోలు మార్చి 20

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గరిమిళ్లపల్లి గ్రామ ప్రాధమికోన్నత పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న గోపు ఆరోగ్యమ్మ తమ తల్లిదండ్రులు కీ.శే. గోపు శౌరీలమ్మ, గోపు రాయపు రెడ్డిల జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చారు. సుమారు రూ.1,00,000 ఖర్చు చేసి పాఠశాల భవనాల లోపల, వెలుపల పేయింటింగ్ చేయించి పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు.ఆమె ఔదార్యాన్ని మెచ్చుకున్న మండల విద్యాశాఖ అధికారి ఆనందం మరియు ఐనవోలు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వేంకటేశ్వర్లు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొని ఆరోగ్యమ్మని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *