కొనుగోలు, రవాణా వేగవంతం చేయాలికొనుగోలు, రవాణా వేగవంతం చేయాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 April, 2026E69NEWS

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రావద్దు

కొనుగోలు, రవాణా వేగవంతం చేయాలి

కొనుగోలు, రవాణా వేగవంతం చేయాలి
🔹 జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు

తెలుగు గళం న్యూస్ జనగామ ఏప్రిల్ 29

జనగాం జిల్లా రఘునాథ్ పల్లి మండలం కోమల్ల గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారులు, నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.టోకెన్ విధానం ద్వారా వచ్చిన ధాన్యాన్ని అదే రోజున తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.వేసవి ఎండల నేపథ్యంలో నిర్వాహకులు, రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *