పలు శుభకార్యాలకు హాజరైన వెన్నంపెల్లిపలు శుభకార్యాలకు హాజరైన వెన్నంపెల్లి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ22 February, 2026E69NEWS

పలు శుభకార్యాలకు హాజరైన వెన్నంపెల్లి

పలు శుభకార్యాలకు హాజరైన వెన్నంపెల్లి

భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగిన కుటుంబ, సామాజిక వేడుకలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపెల్లి పాపన్న హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలు,అభివృద్ధి అంశాలపై ఆరా తీశారు.ముందుగా దుంపిల్లపల్లె గ్రామంకు చెందిన బండి సాంబయ్య కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న పాపన్న,నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.కుటుంబ సభ్యులను అభినందిస్తూ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.తదుపరి మైలారం గ్రామంలో ఐత నరేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని గృహాన్ని దర్శించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇల్లు శాంతి, ఐశ్వర్యాలతో కళకళలాడాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.జిల్లా కార్యదర్శి జిట్టబోయిన సాంబయ్య, జిల్లా నాయకుడు కాంతాల నారాయణరెడ్డి, రేగొండ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్, భాగీర్తిపేట గ్రామ బీజేపీ సర్పంచ్ పేరుమాండ్ల శ్రీలత తిరుపతి గౌడ్, దుంపిల్లపల్లి ఉపసర్పంచ్ నిరటి రంజిత్, వార్డు సభ్యులు బండి శారద కిరణ్, జున్నుతుల వరలక్ష్మి రాజు, పేరబోయిన భాస్కర్, బోయిని కొమల భద్రయ్య, మాజీ వార్డు సభ్యులు బండి నర్సయ్య, బండి రవి, సుధాకర్ తదితరులు హాజరయ్యారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *