పార్టీ బలోపేతమే లక్ష్యమని స్పష్టంపార్టీ బలోపేతమే లక్ష్యమని స్పష్టం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 July, 2026E69NEWS

పార్టీ బలోపేతమే లక్ష్యమని స్పష్టం

పార్టీ బలోపేతమే లక్ష్యమని స్పష్టం

వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మురవత్ మాలక్ష్మణ్ నాయక్‌కు శుక్రవారం పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి,మాజీ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పిండి అనుదీప్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మురవత్ మాలక్ష్మణ్ నాయక్ నాయకత్వంలో వేలేరు మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అండగా నిలుస్తూ,పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి గ్రామంలో పార్టీని మరింత విస్తరింపజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం మురవత్ మాలక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.ఎమ్మెల్యే, కడియం శ్రీహరి,ఎంపీ కడియం కావ్య,పార్టీ సీనియర్ నాయకుల సూచనలు, సలహాల మేరకు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి కార్యకర్తను సమానంగా గౌరవించి, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు, యువ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన మండల అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *