BRSను మరింత బలోపేతం చేస్తాం
పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంలో లక్ష్మణ్ బాబు సేవలు ప్రశంసనీయం – నాయకుల కొనియాడింపు
లక్ష్మణ్ బాబు నాయకత్వంలో జిల్లాలో BRSను మరింత బలోపేతం చేస్తాం – కార్యకర్తల ప్రతిజ్ఞ
తెలుగు గళం ములుగు, వెంకటాపురం:
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబుకి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన సన్మానం నిర్వహించారు. గూడూరు సర్పంచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్ బాబుకు గులాబీ శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో కాకులమర్రి లక్ష్మణ్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ, తనకు అందించిన ఘన సన్మానం ప్రతి కార్యకర్తకు చెందిన గౌరవమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద నాయక్, మల్క రమేష్, లింగాల రమణారెడ్డి, గయ్ అశోక్, గూడూరు సర్పంచ్ ప్రశాంత్, తవిటి కుమార్, ఓకే రమణారెడ్డి, జవాజు శంకర్, తవిటి శ్రీను, నిమ్మల రవి, ములుగుల దేవేందర్ రెడ్డి, తవిటి బాలకృష్ణ, బూరుగు గట్టయ్య, పెద్దపల్లి రవి, వేల్పుల కృష్ణ, గుజ్జుల భరత్, వేల్పుల భాను, అబ్బ గోపాల్ రెడ్డి, తాటి కృష్ణ, భూక్య జంపన్న, కొమరం దనలక్ష్మి, ఎండి వాలి బాబా, తుమ్మ మల్లారెడ్డి, కూనూరు అశోక్ గౌడ్, జంగాలపల్లి సర్పంచ్, ముడతనపల్లి మోహన్, నర్ర భద్రయ్య, పోరిక అర్జు నాయక్, పోశాల వీరమల్లు, సంపత్ రెడ్డి, జనగాం రవి, ఎర్రబెల్లి గోపాలరావు, పిన్నింటి మధుసూదన్ రెడ్డి, గుండ్ల రమేష్, అజ్మీర సాదరులాల్, దుర్గం రమణయ్య, చిట్టి మల్ల సమ్మయ్య, కోయిల మహేష్, భాష నాగ రమేష్, కర్ర రవీందర్, లకావత్ నరసింహ నాయక్, అజ్మీర సురేష్, మాలోత్ గాంధీ, తాడూరి రఘు, యలవర్తి శ్రీనివాసరావు, వావిలాల పోచయ్య, గుడిసేవ నాగేశ్వరరావు, గండేపల్లి నరసయ్య, మూగల నరేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.