షార్ట్ సర్క్యూట్ తో రెస్టారెంట్ దగ్ధంషార్ట్ సర్క్యూట్ తో రెస్టారెంట్ దగ్ధం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ9 January, 2026E69NEWS

షార్ట్ సర్క్యూట్ తో రెస్టారెంట్ దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో రెస్టారెంట్ దగ్ధం

సుమారు 40నుండి 60 లక్షల ఆస్తి నష్టం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ కేంద్రంలోని సెవెన్ హిల్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో పొగలు రావడంతో అటుగా వచ్చిన పాదాచారులు, రైతులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు.వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 గంట పాటు శ్రమించి మంటలార్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు, సుమారు రూ.40 లక్షల నుండి 60 లక్షల వరకు ఆస్తి నష్టం,మందు (లిక్కర్) నష్టం వాటిల్లినట్లు బార్ యజమాని దుబ్బాక నరేష్‌రెడ్డి వెల్లడించారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో షాప్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఫైల్స్, కొంత నగదు మంటల్లో కాలిపోయినట్లుగా ఆయన తెలిపారు. ఈ సంఘటన ను చూసి తీవ్ర వేదనకు గురియ్యడు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *