అభ్యర్థులకు ఎన్నికల వ్యయం సమావేశం అభ్యర్థులకు ఎన్నికల వ్యయం సమావేశం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ4 February, 2026E69NEWS

అభ్యర్థులకు ఎన్నికల వ్యయం సమావేశం

అభ్యర్థులకు ఎన్నికల వ్యయం సమావేశం

ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలోనీ పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో బుదవారం ఉదయం 02 వ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అవగాహన సదస్సు జరిగింది.మున్సిపల్ కమీషనర్ నరసింహ అధ్యక్షత వహించారు.అభ్యర్థుల ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితి లక్ష రూపాయలు మాత్రమేనని వెల్లడించారు. వాళ్లు దాన్ని సంబంధించిన ఏమి ప్రచారం చేసిన లక్ష పరిమితిలోనే ప్రచారం చేయాలన్నారు.సభలకి వాహనాలకు వినియోగానికి తప్పనిసరిగా మునిసిపల్ పర్మిషన్ తీసుకోవాలనీ నరసింహ స్పష్టం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. దీనికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు ఇక్కడ ఉన్నాయి .ఖర్చుల రిజిస్టర్ నిర్వహణ నామినేషన్ వేసినప్పటి నుండి ఫలితాల ప్రకటన వరకు అభ్యర్థి చేసే ప్రతి ఖర్చును విడివిడిగా రిజిస్టర్లో నమోదు చేయాలి.ప్రత్యేక బ్యాంక్ ఖాతా నామినేషన్ వేయడానికి కనీసం ఒక రోజు ముందే అభ్యర్థి తన పేరుతో లేదా ఎన్నికల ఏజెంట్ పేరుతో ఒక ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలి. ఎన్నికల ఖర్చులన్నీ ఈ ఖాతా నుంచే జరగాలి.ఖర్చుల పరిమితి మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలలో జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గరిష్ట పరిమితికి లోబడే ఖర్చు చేయాలి.ఖర్చుల వివరాల దాఖలు ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల ఫార్మాట్లో సంబంధిత అధికారులకు సమర్పించాలి. నిబంధనల ఉల్లంఘన – అనర్హత నిర్ణీత సమయంలోగా ఖర్చుల వివరాలు సమర్పించకపోయినా లేదా నిర్ణీత పరిమితికి మించి ఖర్చు చేసినా, అభ్యర్థిని 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఖర్చుల రకాలు బహిరంగ సభలు, ప్రచార వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు, సోషల్ మీడియా ప్రకటనలు మరియు టీ/ కాఫీ వంటి చిన్నపాటి ఖర్చులను కూడా రిజిస్టర్లో చూపాలి.మరింత సమాచారం మరియు ఫార్మాట్ల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.అభ్యర్థుల ఖర్చును వారి నామినేషన్ సమయంలో సమర్పించాలి ,వారి బ్యాంకు ఖాతాల నుంచే నిర్వహించాలి. వారికి బుక్ లేట్ లను 3 సార్లు తీసుకురావాలి , 5 6 7 తారీకు న అభ్యర్థి లేదా ఆర్థరైజ్డ్ వ్యక్తి తప్పని సరిగా హాజరు పరచాలి. అభ్యర్థులు అడిగిన ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ టి ఒ టి ఎస్ లు , అకౌంట్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *