ఆకుతోట ఫంక్షన్ హాల్ లో ఘనంగా శ్రీజ దిలీప్ వివాహం
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కరిమిళ్ల దేవేందర్ రావు -అరుణ దంపతుల కుమార్తె చి.ల.సౌ. శ్రీజ,చి.దిలీప్ ల వివాహ మహోత్సవం వరంగల్ ఆకుతోట కల్యాణ మండపంలో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్,నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.పర్వతగిరి వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు ఎం మనోజ్ కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, పార్టీ నాయకులు కరిమిళ్ల దుర్గారావు, కరిమిళ్ల మోహన్ రావు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అందరూ ఆకాంక్షించారు.