E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ26 August, 2026E69NEWS

కానిస్టేబుల్‌పై దాడి కేసులో ఇద్దరిపై కేసు నమోదు

ఈ69న్యూస్ వరంగల్, ఆగస్టు 26

వరంగల్ ఉర్సు ప్రాంతంలోని ఓ బార్ ముందు బెటాలియన్ కానిస్టేబుల్ జవ్వాజి మనోజ్‌పై కర్రలతో దాడి చేసిన ఘటనకు సంబంధించి ఎట్టకేలకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్ స్వయంగా ఫిర్యాదు చేయకపోవడంతో మిల్స్ కాలనీ ఎస్సై శ్రవణ్ కుమార్ సుమోటోగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఈ ఘటనలో శ్రీనివాస్, అరుణ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉర్సు ప్రాంతంలోని బార్ ముందు చోటుచేసుకున్న ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో విషయం చర్చనీయాంశంగా మారింది.అయితే, బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు కానిస్టేబుళ్లపై మాత్రం ఇప్పటివరకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.బాధితుడు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడం పోలీసుల స్పందనకు నిదర్శనంగా నిలిచింది. అయితే దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిపై సమానంగా చర్యలు తీసుకుంటారా? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *