ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్"
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్”
విసన్నపేట,ఆగస్టు07(తెలుగుగళం) న్యూస్:
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాల సందర్భంగా శుక్రవారం విస్సన్నపేట బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు 600 పైగా విద్యార్థినీ, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఎమ్మార్వో కార్యాలయం లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. 8,9 తేదీల్లో కేపిఆర్ కన్వెన్షన్ లో ప్లీనరీ సమావేశాలు జరగనున్నయని ప్రకటించరు. జిల్లాలో విద్యార్థుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యచరణ తీసుకునేందుకు ఈ సమావేశాలు జరగనున్నయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కే ప్రసన్నకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల సమస్యల పరిష్కరించడం మానేసి విద్యార్థి సంఘాలను అణిచివేతకు పూనుకుందని ఇది ఈ ప్రభుత్వానికి తగదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కూటమి ప్రభుత్వం కాలరాయడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటే ప్రశ్నింస్తున్న ఎస్ఎఫ్ఐ పైన సంఘాలపై ఆంక్షల విధిస్తూ జీవోలు తీసుకురావడం కూటమి నిరంకుశ పాలనకు నిదర్శనం అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఫీజుబకాయిలు చెల్లించలేదు. ఇకపై కూటమి ప్రభుత్వం ఫీజుల సమస్య లేకుండ సకాలంలో చెల్లించి సక్రమంగా చదువు కొనసాగేలా చూస్తామని హామీ ఇచ్చిన విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు నేడు ఊసెత్తడంలేదని వాపోయారు. ఫీజుల బకాయిలు మరింత భారంగా మారి నేడు రాష్ట్రం లో విద్యార్థులు భవిష్యత్తు, ఉన్నత చదువులు గందరగోళంగా మారిందనన్నారు. ఇది ప్రైవేటు విద్యాసంస్థల్లోనే కాదని ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీలలో సైతం ఫీజులు కడితేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కార్పొరేట్ ప్రైవేటు కళాశాలలు ఫీజులు కట్టకపోతే కళాశాలకు రావద్దని, పరీక్షల నిర్వహించమని ఇబ్బంది పెడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. ప్రభుత్వం మౌనం వీడి తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు భగత్ రవి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలనుండి హాస్టల్ విద్యార్థులు సమస్యలు, మెస్స్ బిల్లులు పెంచడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నయని మెస్స్ బిల్లులు మాత్రం నామమాత్రంగా ఉందన అవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహరంపై నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమైన చర్య అని తక్షణమే నెలకు 3000 రూ. మెస్ బిల్లు పెంచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసి పేద విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియాంబర్స్ మెంట్ లబ్దిదారుల సంఖ్య తగ్గించేందుకు తప్ప మరొకటి కాదని తక్షణమే ఇలాంటి విద్యార్థుల వ్యతిరేకంగా చేసే విధానాలును అడ్డుకుంటాం అని తెలిపారు.