కేసీఆర్కు ఘన స్వాగతం.. ములుగు గడ్డపై బీఆర్ఎస్ శ్రేణుల జోష్!
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయడంతో పాటు, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలతో ఏటూరునాగారం నుంచి మల్లంపల్లి వైపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు కేసీఆర్ అందించిన నాయకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ములుగు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లడం పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్సాహానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్కు ములుగు జిల్లా ప్రజల తరఫున ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.