చెంచుపల్లి గ్రామంలో ఘనంగా గ్రామసభ సమావేశంచెంచుపల్లి గ్రామంలో ఘనంగా గ్రామసభ సమావేశం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ25 March, 2026E69NEWS

చెంచుపల్లి గ్రామంలో ఘనంగా గ్రామసభ సమావేశం

చెంచుపల్లి గ్రామంలో ఘనంగా గ్రామసభ సమావేశం

భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం చెంచుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా గ్రామసభ సమావేశం ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ జేల్లా రాము అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో గ్రామానికి సంబంధించిన ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.గ్రామసభలో గ్రామ ఆదాయం–వ్యయాల వివరాలను సమీక్షించడంతో పాటు పారిశుద్ధ్య పనుల నిర్వహణ, మంచినీటి సౌకర్యాల మెరుగుదలపై చర్చించారు. అలాగే ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం అమలు, ఉపాధి హామీ పనుల పురోగతి, గ్రామ నర్సరీ అభివృద్ధి, నర్సరీలో పెంచాల్సిన మొక్కల ఎంపికపై ప్రణాళిక రూపొందించారు.ఇదే సమయంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ అభివృద్ధి ప్రణాళిక (బడ్జెట్ నమూనా)పై సమగ్రంగా చర్చించి, ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.ఈ గ్రామసభలో ఉప సర్పంచ్ ఇండ్ల భద్రమ్మ, వార్డ్ సభ్యులు భద్రయ్య, నరేష్, రజిత, పంచాయతీ కార్యదర్శి కర్ణకంటి నరేష్, అంగన్వాడీ టీచర్ మేకల యమున, హెల్పర్ మేకల చంద్రకళ, గ్రామపంచాయతీ సిబ్బంది బండి రాజు, ఇండ్ల సంపత్, మధ్యాహ్న భోజన కార్యకర్త జెల్ల పద్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *