జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను ఐడీఓసీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను ఐడీఓసీ
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ8 May, 2026E69NEWS

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఆర్వో వసంత కుమారి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను ఐడీఓసీ

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లా నూతన జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్వో)గా బాధ్యతలు స్వీకరించిన వసంత కుమారి శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను ఐడీఓసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన వసంత కుమారిని కలెక్టర్ అభినందిస్తూ, జిల్లా అభివృద్ధిలో మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రెవెన్యూ విభాగం పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.జిల్లాలోని అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆమెకు సూచించారు.ముఖ్యంగా రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు.దీనిపై డిఆర్వో వసంత కుమారి స్పందిస్తూ.. జిల్లాలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ,ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ సిబ్బంది, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *