E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ27 June, 2026E69NEWS

ధర్మసాగర్ ఇన్స్‌పెక్టర్ శ్రీధర్ రావు ఏఆర్‌కు అటాచ్

భూవివాదం ఆరోపణలపై విభాగీయ విచారణకు సీపీ సన్ప్రీత్ సింగ్ ఆదేశం

తెలుగు గళం న్యూస్ వరంగల్, జూన్ 27

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ శ్రీధర్ రావును ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్)కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్స్‌పెక్టర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ పరిపాలనా నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.పెద్దపెండ్యాల గ్రామంలో కొనసాగుతున్న భూవివాదానికి సంబంధించి సర్పంచ్ తోట నాగరాజుతో కలిసి రూ.2 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలు ఇన్స్‌పెక్టర్ శ్రీధర్ రావుపై వచ్చినట్లు సమాచారం. ఈ ఆరోపణలను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి, వాటిపై సమగ్ర విభాగీయ విచారణ నిర్వహించాలని నిర్ణయించారు.విచారణను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులను నియమించి, పూర్తి నివేదికను త్వరితగతిన సమర్పించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.విచారణ పూర్తయ్యే వరకు పరిపాలనా అవసరాల దృష్ట్యా శ్రీధర్ రావును ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి ఏఆర్‌కు అటాచ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.విచారణ నివేదిక ఆధారంగా తదుపరి పరిపాలనా లేదా విభాగీయ చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *