భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ ల స్మారక వారోత్సవాలుభగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ ల స్మారక వారోత్సవాలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ22 March, 2026E69NEWS

భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ ల స్మారక వారోత్సవాలు

భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ ల స్మారక వారోత్సవాలు

విప్లవ వీరుడు భగత్సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించటం జరిగింది. ఈ ర్యాలీని బీవీకే ట్రస్ట్ మేనేజర్, వై.శ్రీనివాస్ గారు జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు తుడుం ప్రవీణ్, బొడ్డు మధు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల ఆశలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం, లౌకికత్వం ,సమానత్వం కోసం పోరాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల త్యాగం భారత యువతకు పూర్తిగా నిర్మిస్తుందని తెలిపారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం విద్యారంగంపై దాడులు ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ ల ఆలోచనలు నేడు మరింత అవైశక్యంగా మారాయని వారు తెలిపారు. యువత సమాజ మార్పు కోసం చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజానికి పట్టిపీడిస్తున్న గంజాయి డ్రగ్స్ బెట్టింగ్ యాప్స్ తో యువత పెడదొరనులు పడుతున్నారని వాటికి వ్యతిరేకంగా విద్యార్థి యువత నడుం బిగించాలని సూచించారు. రాబోయే రోజుల్లో నిర్వహించనున్న భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలలో భాగంగా జిల్లావ్యాప్తంగా సెమినార్లు సంస్కృతిక కార్యక్రమాలు చర్చా వేదికలు యువజన ర్యాలీలు డ్రగ్స్ గంజాయి బెట్టింగ్ యాప్ వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వంకాయలపాటి రాజు, ఖమ్మం డివిజన్ అధ్యక్షులు త్రినాథ్ జిల్లా నాయకులు సుశాంత్ , లోకేష్, జానీ, అశోక్, ఉపేందర్, డివైఎఫ్ఐ ఖమ్మం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి నరేష్, రావులపాటి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు, కొంగర నవీన్,ధనాలకోట రవి కుమార్, డివైఎఫ్ఐ నాయకులు, అజయ్ గోపి, రాజేశ్,తండు శ్రీహరి, బానోత్ గణేష్, సతీశ్ , గోపాలరావు, నాయకులు, సురేష్,గోపి తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *