E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

రంగశాయిపేటలో విజయవంతంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం

ఈ6 న్యూస్ వరంగల్ జూన్ 28

వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఐదేళ్లలోపు చిన్నారులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో బూత్‌లలో తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రజలు మంచి స్పందన అందించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జననం నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, మొదటి రోజు మిస్ అయిన పిల్లలకు ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతాయుతంగా భాగస్వామి కావాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *