లచ్చ నాయక్ దశదినకర్మలో ప్రముఖుల నివాళులులచ్చ నాయక్ దశదినకర్మలో ప్రముఖుల నివాళులు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ26 March, 2026E69NEWS

లచ్చ నాయక్ దశదినకర్మలో ప్రముఖుల నివాళులు

లచ్చ నాయక్ దశదినకర్మలో ప్రముఖుల నివాళులు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తార్య తండలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చ నాయక్ దశదినకర్మ కార్యక్రమం గౌరవప్రదంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని లచ్చ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.ఎన్. నాయక్, కార్పొరేటర్ లావుడియా రవి నాయక్, లంబాడీల ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఈసీ సభ్యులు అనసూర్య జగరాం నాయక్, గబ్బర్ సింగ్, సీనియర్ జర్నలిస్ట్ భూక్య శ్రవణ్ కుమార్, బిక్షపతి, రాజేష్, రాజేందర్ తదితరులు హాజరై తమ సానుభూతిని తెలియజేశారు.మృతుడు లచ్చ నాయక్ సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *