E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 March, 2026E69NEWS

వి బిజీ రాంజీ బిల్లును రద్దు చేయాలి

మూడు వారాలుగా పెండింగ్లో ఉన్న వేతనాలివ్వాలి: జాజిరి శ్రీనివాస్(డివిజన్ కార్యదర్శి) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రేజర్ల గ్రామంలోని ఉపాధి హామీ కూలీల పని ప్రదేశం వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కూలీలు నేతలకు తమ సమస్యలను వెల్లబుచ్చారు.ప్రధానంగా చూస్తే మూడు వారాల నుండి పనిచేస్తున్నపటికి వేతనాలు రావడం లేదని కూలీలు తెలిపారు.పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రలోని మోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని రద్దుచేసి విబిజిరామ్ జీ పథకంగా మార్చి నిధులు కోత విధించదని తెలిపారు.ఈ పథకం పూర్తిగా పేదలకు వ్యతిరేకమని, వ్యవసాయ కార్మికుల పని హక్కును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. వి బి జీ రాంజీ నిధులు వాటాను రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరించాలని నిర్ణయించడం వలన రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వాటా భరించే పరిస్థితుల్లో లేవన్నారు. పని దినాలు వంద రోజుల నుండి 125 రోజుల వరకు పెంచామని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్న వి బి జి రామ్ జీ పథకంలోని నిబంధన ప్రకారం పేదలకు పని కల్పించే పరిస్థితి లేదన్నారు.పని ప్రదేశాలలో కూలీలకు మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్,ఓఆర్ఎస్ ప్యాకెట్లు,నీడ కోసం టెంటు,మౌలిక వసతులు కల్పించాలన్నారు.ఉదయం, సాయంత్రం ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని,పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని జాజిరి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో: వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, కారుమంచి శ్రీలక్ష్మి,గద్దల సువార్త,మొండ్రు పార్వతి, పారంపూడి అపర్ణ,మిక్కిలి శ్యామలరావు,గద్దల వెంకటేశ్వరరావు,ఎస్ నిర్మల, కొత్తపెల్లి సత్యం,వీరంకి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *