భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ5 February, 2026E69NEWS

సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి—భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గానికి రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు,పార్టీ నేతలకు సూచించారు.సీఎం పర్యటనలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని ఎమ్మెల్యే తెలిపారు.అలాగే గణపురం మండలం చెల్పూరు గ్రామ పంచాయతీ శివారులో నిర్వహించనున్న భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, హెలీప్యాడ్ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు.సీఎం పర్యటన దృష్ట్యా అన్ని పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అదేవిధంగా, చెల్పూరు గ్రామ శివారులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.సీఎం పర్యటన భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *