E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ24 March, 2026E69NEWS

హసన్పర్తి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

ఈ69న్యూస్ హనుమకొండ మార్చి 24హసన్పర్తి మండల పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు, పై అధికారుల పర్యవేక్షణలో మొత్తం 12 సైన్ బోర్డులు/హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇందులో భాగంగా, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న హనుమకొండ–కరీంనగర్ నేషనల్ హైవే రోడ్డుపై 8 హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హనుమకొండ నుంచి అంబాల వెళ్లే రోడ్డులో 2 బోర్డులు, ORR వంగపాడు సమీపంలో మరో 2 హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ బోర్డుల ప్రధాన ఉద్దేశం వాహనదారులు అప్రమత్తంగా ఉండి, వేగాన్ని తగ్గించి సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రోత్సహించడం. దీంతో ప్రమాదాలను తగ్గించడంతో పాటు, వాహనదారులు తమ గమ్యస్థలాలకు సురక్షితంగా చేరుకోవడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *