mancherial news todayమంచిర్యాల న్యూస్ mancherial news today

మంచిర్యాల: జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల పరిధిలోని రేచిని రైల్వేస్టేషన్ రోడ్ సేవాజ్యోతి కాలనీ వద్దగల సేవాజ్యోతి శరణాలయం లో డాక్టర్ లావుడ్య రజిత వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ – సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి సగర మాట్లాడుతూ నేటి సమాజంలో సేవా దృక్పథంతో వైద్యులు ముందుకు వచ్చి వైద్యజ్యోతులుగా వెలగాలి, గతంలో తాండూర్ మండల వైద్యాధికారి గా ఎనలేని సేవలు అందించిన ఆమె ఇప్పుడు మనమధ్య లేకపోయినా ఆమె ఉన్నన్ని రోజులు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసింది,ఒక వైద్యురాలు గా కాకుండా తోటి మనిషి గా తన సేవా కార్యక్రమాలు సేవానిరతి తో అభాగ్యులకు నిరంతరం సేవలు చేసిందని పేర్కొన్నారు, ప్రతి వైద్యులు ఇలా సమాజానికి ఆదర్శంగా జీవించాలని కోరుతూ మా ప్రార్ధన, సేవలు చేయాలి జనజాగృతి కావాలి, ఈ కార్యక్రమంలో సేవా జ్యోతి సహావిద్యార్థి ప్రముఖ్ సర్వమాధవజిత్, శంకరం, శ్యాం రావ్, సాయి, లక్ష్మీ,‌శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *