marepeda newsmarepeda news

శ్రీరామ మందిర అక్షింతలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది.జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తులు నినాదాలు చేస్తూ గ్రామంలో అయోధ్య రామ మందిరం విశిష్టత గురించి తెలిసే విధంగా భక్తులకు ఇంటింటా కరపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా అయ్యగారు దీపతి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ఐదు వందల ఏళ్ల క్రితం అయోధ్యలో రాముడిని ప్రాణ ప్రతిష్టాపన చేసిన సమయంలో స్వామి వారి పాదాల వద్ద ఈ అక్షింతలను భద్రపరిచారని,అయోధ్య రాముడి పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలు రామాలయం గుడికి అందించడం మాకు మా గ్రామానికి భాగ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో చిర్ర మధుసూదన్ గౌడ్ స్వామి,వెల్ది లక్ష్మి మల్లయ్య,ఈరగాని సుశీల ఉపేందర్,రాంపల్లి లింగమ్మ వెంకన్న,అనుముల సుమతి నాగిరెడ్డి,దోమల జయమ్మ సత్యనారాయణ, దోమల సోమయ్య బిక్షువమ్మ,బుడిగే రజిత,రాంపల్లి లక్ష్మి నాగన్న,వెల్ది అశోక్,వెల్ది సాయికుమార్,ఆదిమూల యాకయ్య,దోమల సత్తయ్య,దోమల అశోక్ ఉరుకొండ వెంకన్న,మాడుగుల వెంకన్న కేదారి, గ్రామ ప్రజలు రామభక్తులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *